Sunday, May 5, 2024

National : రైతుల ఆందోళనకు రెండు రోజులు బ్రేక్.. రేపు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌…

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళ‌న రెండు రోజుల పాటు బ్రేక్ ప‌డింది. నిన్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
దీంతో పలువురు రైతులు గాయపడ్డారు. కనౌరి బార్డర్‌లో యువరైతు మృతి చెందాడు. దీంతో రైతు సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల దాడిలోనే రైతు ప్రాణం కోల్పోయాడని ఫైర్ అవుతున్నాయి. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడంతో.. అన్నదాతలు తాజాగా మరోసారి కదం తొక్కారు. చలో ఢిల్లీ పేరుతో హస్తినలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పంజాబ్ , హర్యానా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లతో హస్తినకు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. 2020-21 సమయంలో తామంతా ఉద్యమించినప్పుడు డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కేంద్రం వాటిని నెరవేర్చలేదని.. ఇప్పుడు ఆ హామీలను సాధించుకోవడం కోసమే ఈ భారీ ఆందోళన చేపట్టామని రైతులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement