Tuesday, July 23, 2024

TS | డ్రైవర్ ఆత్మహత్యా యత్నంపై సజ్జనార్ స్పందన.. అలా ఎందుకు చేశాడో..

ఆర్టీసీ డ్రైవర్‌‌కు లీవ్ ఇవ్వకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం కారణంగానే ఆ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తున్న వార్తలపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్‌ శంకర్‌‌కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.

ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరు అయ్యారని. అయినా ఈ నెల 20న డ్యూటీని అధికారులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఆదివారం సెలవు కావాలని డిపో అధికారులను డ్రైవర్ శంకర్ సంప్రదించగా.. వాళ్ళు లీవ్ పొజిషన్ చూసి సెలవు మంజూరు చేస్తామన్నారు. కానీ సెలవు ఇవ్వబోమని డ్రైవర్ కు ఏ అధికారి చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు.

ఆర్టీసీ అధికారులు తనకు సెలవు మంజూరు చేయడం లేదని, వేధిస్తున్నారని డ్రైవర్ శంకర్ ఆరోపిస్తూ.. పురుగుల మందు తాగుతున్ననంటూ శనివారం ఒక సెల్ఫీ వీడియో వాట్సాప్ గ్రూప్‌ల్లో చేశాడు. వెంటనే డిపో అధికారులు అక్కడికి వెళ్లి ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఎలాంటి పురుగుల మందు తాగలేదని వైద్యులు ధ్రువీకరించి.. అనంతరం డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ శంకర్ ఆయన ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాడని సజ్జనార్ తెలిపారు.

- Advertisement -

డ్రైవర్ శంకర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారని సజ్జనార్ అన్నారు. గతంలోనూ సెలవుల విషయంలో అధికారులపై బెదిరింపులకు దిగారని తెలిపారు. తన లీవ్ రికార్డు బాగాలేదని… డ్రైవర్ శంకర్ గత మూడు నెలల్లో 10 సాధారణ లీవ్ లు, 20 సిక్ లీవ్ లు తీసుకున్నాడని సజ్జనార్ స్పష్టం చేశారు.

సిబ్బందికి సెలవుల మంజూరు విషయంలో నిబంధనల ప్రకారమే టీఎస్ ఆర్టీసీ నడుచుకుంటోందన్నారు. లీవ్ పొజిషన్, కారణం తీవ్రతను బట్టి సిబ్బందికి సెలవులను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ ఏమాత్రం ఉపేక్షించదని…. ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement