Sunday, April 21, 2024

TS – దేశ భవిష్యత్ ను ప్రగతి పదంలోన‌డిపేది బీజేపీయే…నితిన్ గడ్కరి

నిజామాబాద్ ఫిబ్రవరి (ప్రభ న్యూస్) 29: దేశ భవిష్యత్తును ప్రగతి పదంలోకి తెచ్చేది… బీజేపీ యేనని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. కాంగ్రెస్.. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అమెరికాకు దీటుగా తెలంగాణలో రోడ్లు తీర్చిదిద్దుతామని తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగు పడినప్పుడే వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ది చెందుతా యన్నారు. గురువారం నిజా మాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన విజయ సంకల్పయాత్ర ముగింపు సభ కార్య క్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అద్వాన్నంగా తయారయ్యాయన్నారు. .రోడ్లు, తాగు నీరు సౌకర్యాలు లేక ప్రజలు పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సర్కారు ఆసుపత్రులలో సౌకర్యాలు లేక అందుబాటు లో అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయని వాపోయారు.

కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి బాగా లేదన్నారు. 25 శాతం నుంచి 30 శాతం వరకు ప్రజలు పల్లెలను విడిచి పట్ట ణాలకు వలస వెళ్లారని తెలి పారు కాంగ్రెస్ హయాంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేయలేద‌ని ఆరోపించారు. గ‌తంలో ప్రధానిగా ఉన్న‌ అటల్ బిహారీ వాజ్ హాయంలో రోడ్ల నిర్మాణాల కోసం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చామనీ గుర్తు చేశారు. విమానాలకు ఇంధనం అం దించే సత్తా మన రైతుల్లో ఉంద‌న్నారు. రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని బలో పేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ఆత్మ హత్యలు ఆపేందుకు .. రైతు సంక్షే మం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో సాగవుతున్న పసుపు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోందని తెలిపారు. తెలంగాణలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీ మావ్యక్తం చేశారు.

పసుపు రైతులకు మంచి రోజులు – ఎంపీ ధర్మపురి అరవింద్

15 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభు త్వం ప్రత్యేక కృషితో పసువు క్వింటాలుకు రూ. 15 వేలకు వచ్చింది.. పసుపు రైతులకు మంచిరోజులు వచ్చాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు నితిన్ గడ్కరీ లాంటి నాయకులు చాలా రేర్ గా ఉంటారు. ఒక పని మీద వెళితే అప్పటికప్పుడు స్పందించి పరిష్కారం చేస్తారని తెలిపారు. ఈ జిల్లా పసుపు పంట చాలా ప్రత్యేకమని 15 ఏళ్ల తర్వాత పసువు క్వింటాకు రూ. 15 వేల ధ‌ర‌ వచ్చింది. గతంలో రూ.6 వేలు మాత్రమే పలికేదన్నారు.పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ నిజాo షుగర్ ఫ్యాక్టరీని రాజకీయంగా వాడుకుంటోందన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామా బాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు దినేష్ కులా చారి , రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, యెండల లక్ష్మి నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంగా రెడ్డి, బిజెపి నాయకులు, కార్య కర్తలు, ప్రజాప్రతినిధులు, పోలింగ్ బూత్ స్థాయి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement