Friday, May 17, 2024

Transgender Queen – అందాల‌ పోటీల‌లో సంచ‌ల‌నం – ట్రాన్స్ జెండ‌ర్ కు మిస్ నేద‌ర్ ల్యాండ్ కిరీటం

ఆమ‌స్ట‌ర్‌డామ్‌: మిస్ నెద‌ర్లాండ్స్ టైటిల్‌ను తొలిసారి ఓ ట్రాన్స్‌జెండ‌ర్ మ‌హిళ గెలుచుకున్న‌ది. ఆ ఘ‌న‌త‌ను త‌న ఖాతాలో వేసుకున్న‌ది. అంద‌గ‌త్తెల పోటీల్లో ట్రాన్స్‌జెండ‌ర్ మ‌హిళ ఆ టైటిల్‌ను ద‌క్కించుకోవ‌డం చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసారి. 22 ఏళ్ల రిక్కీ వ‌లేరి కొల్లే పోటీల్లో మేటి మోడ‌ల్స్‌ను ఓడించింది. ఆమ‌స్ట‌ర్‌డామ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రిక్కీ విజేత‌గా నిలిచింది. దీంతో ఎల్ సాల్వ‌డార్‌లో జ‌ర‌గ‌నున్న 72వ మిస్ యూనివ‌ర్స్ పోటీల‌కు ఆమె ఎంపికైంది.

టైటిల్ గెలిచిన త‌ర్వాత ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. గ‌ర్వంగా, ఆనందంగా ఉన్న‌ట్లు ఆమె పేర్కొంది. ఆ సంతోషాన్ని వ‌ర్ణించ‌లేన‌ని చెప్పింది. త‌న ఇన్‌స్టాలో ఈవెంట్‌కు చెందిన ఫోటోలు, వీడియోల‌ను అప్‌లోడ్ చేసింది. మ‌హిళ‌ల‌కు రోల్ మాడ‌ల్ కావాల‌నుకుంటున్నాన‌ని, వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌నున్నాని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement