Wednesday, June 19, 2024

TS | రాష్ట్రంలో 26 మంది డిఎస్‌పిల బదిలీ..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో గడచిన వారం రోజుల్లో 225 డిఎస్‌పిలను బదిలీ చేశారు. తాజాగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఐపిఎస్‌ అధికారుల నుంచి అన్ని హోదాలలో ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తున్నది.

గతమూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న, సొంత జిల్లాల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ డిసెంబర్‌లో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులకు స్థానచలనం కల్పించినట్లు పోలీసుశాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. కాగా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ అధికారులను అసెంబ్లి సమావేశాల అనంతరం మూకుమ్మడిగా బదిలీ చేసేందుకు ఆయా జిల్లాల పోలీసు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement