Wednesday, February 28, 2024

విషాదం.. ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి..

వ‌న‌ప‌ర్తి : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘ‌ట‌న వ‌న‌ప‌ర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని శ్రీరంగాపురం మండలం తాతిపాములలో వీరసముద్రం చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి తిరుపతమ్మ (16), సంధ్య (12), దీపిక (10)లు పడి మరణించారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటికి వారి మృతదేహాలు లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement