Friday, May 3, 2024

Film industry: సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డితో టాలీవుడ్ పెద్ద‌లు భేటి..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. 15 మందితో కూడిన టాలీవుడ్ టీమ్ మంత్రిని కలిసింది. కొన్ని ప్రతిపాదనలను అందజేసింది.

మంత్రిని కలిసిన వారిలో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు ఉన్నారు. పలు రాయితీలను వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో మర్యాదపూరకంగా మంత్రిని కలిశామని సినీ పెద్దలు చెప్పారు. సినిమా రంగ పురోభివృద్ధి వీలైనంత సహాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. సినీ ఇండస్ట్రీని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా తెలంగాణలోని ఇతర నగరాల్లో కూడా విస్తరించాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు. దీనికి సహకరిస్తామని మంత్రి చెప్పారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement