Saturday, October 12, 2024

Titanic Dinner Menu | టైటానిక్ డిన్నర్ మెనూ వేలం.. 84.5 లక్షల‌కు సొంతం చేసుకున్న ఔత్సాహికుడు

టైటానిక్ ఫస్ట్ క్లాస్ డిన్నర్ మెనూ ఇటీవలే ఇంగ్లాండ్‌లో వేలం వేశారు. ఓడ మునిగిపోవడానికి మూడు రోజుల ముందు ఈ మెనూని అందిచినట్టు దానిపై ఉన్న తేదీలు సూచిస్తున్నాయి. అయితే వేలంలో ఈ మెనూ ధర ఏకంగా 83 వేల పౌండ్లు (రూ. 84.5 లక్షలు) ప‌ల‌క‌డం విశేషం.

ఐర్లాండ్‌లోని క్వీన్స్‌టౌన్ నుండి న్యూయార్క్‌కు ప్రయాణించేటప్పుడు టైటానిక్ నౌకలో అందించిన ఆహారాన్ని ఈ చారిత్రాత్మక మెనూలో పొందుప‌రిచారు. ఈ కార్డ్ ను ఇటీవ‌ల‌ హెన్రీ ఆల్డ్రిడ్జ్ & సన్ ఆఫ్ విల్ట్‌షైర్ వేలం వేశారు. ఈ వేలంలోనే ఈ మెనూ కార్డు 83 వేల పౌండ్లు (రూ. 84.5 లక్షలు) ప‌ల‌కింది. కాగా, ఈ ఫ‌స్ట్ క్లాస్ డిన్న‌ర్ మెనూలో గుల్లలు, సాల్మన్, గొడ్డు మాంసం, స్క్వాబ్, బాతు, చికెన్, దుంపలు, అన్నం, పార్స్నిప్ కూర వంటి వంటకాల జాబితా కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement