Friday, May 3, 2024

భారత్లో విస్తరించిన టైగర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌..

వాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ బాటిల్‌ మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా టైగర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తన ఉనికిని విస్తరిస్తోంది. మే నెలలో తమ థర్మల్‌ ఉత్పత్తుల్లో భాగంగా నాలుగు కొత్త వాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ బాటిళ్లను ప్రారంభించడం ద్వారా తన ఉనికిని విస్తరించనుంది. ఈసందర్భంగా టైగర్‌ ఇండియా ప్రతినిధి మసాఫుమి యమమోటో మాట్లాడుతూ… భారతదేశంలో వాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ బాటిల్స్‌ను విస్తరించడమే తమ లక్ష్యమన్‌రు. తాము భారతదేశంలో జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చడమే కాకుండా ప్లాస్టిక్‌ కంటైనర్లు, పీఈటీ బాటిళ్ల వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని నిరంతరం కాపాడేందుకు దోహదం చేస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement