Saturday, May 11, 2024

పాత నేరస్తులపై పీడీ యాక్టు, నాటుసారా, గంజాయి నియంత్రణకు ఇదే మార్గం: ఎస్‌ఇబి కమిషనర్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా కట్టడి, నాటు సారా తయారీ నియంత్రణ పూర్తి స్ధాయిలో అమలు కావాలంటే మళ్ళీ మళ్ళీ నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తున్నామని, పాత నేరస్తులను కట్టడి చేసేందుకు ఇదే మార్గ మని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో రాష్ట్ర కమిషనర్‌, లా అండ్‌ అర్డర్‌ అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ సారా, మద్యం అక్రమ రవాణా అడ్డుకుంటున్నట్లు చెప్పారు. సాంకేతిక టెక్నాలజీని వినియోగించి నిఘా ఏర్పాటు, గసీముమ్మరం చేయడం వంటి పటిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. డీజీపీ కెవి రాజేంద్రనాథ్‌ రెడ్డి పర్యవేక్షణలో రాష్ట్రంలో స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సత్ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టడానికి మెరుగైన అదునిక సాంకేతిక వ్యవస్థతో ముందుకు వెళ్తున్నామని, ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రత్యేక నిఘా వ్యవస్థతో ఎస్‌ఇబి మెరుపు దాడులు చేస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి సిసి కెమెరాలు, మొబైల్‌ చెక్‌ పోస్టులు, ఇన్‌ఫార్మర్ల వ్యవస్ధను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల నుండి అందున్న సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటున్నట్లు తెలిపారు.

గత వారంరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలు, దాడుల్లో నాటుసారా తయారీ, మద్యం అక్రమ రవాణా, అనధికార మద్యం విక్రయాలు, అక్రమ మద్యం సరఫరా అదేవిధంగా గంజాయి రవాణా వంటి నేరాల కింద మొత్తం 553 కేసులు నమోదు చేయగా 649 మంది నిందితుల ను అరెస్టు చేశారు. అదేవి ధంగా 67 వాహనాలు సీజ్‌ చేసి లక్షా 18వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 2,720 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని 28,180 లీటర్ల బెల్లం ఉూట ధ్వంసం చేశారు. 3,380 కేజీల నల్ల బెల్లం స్వాధీనం చేసుకుని, 1,954 లీటర్ల సుంకం చెల్లించని మద్యం సీజ్‌ చేశారు. మొత్తం మీద 483 బైండోవ ర్‌ కేసులు ఎస్‌ఇబి నమోదు చేసింది. నాటుసారా తయారీ, అక్రమ మద్యం, గంజాయి వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఇక నుంచి పీడీ యాక్టులు నమోదు చేయడం జరుగుతుందని కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement