Tuesday, May 28, 2024

Delhi | తెలంగాణ బీజేపీ అభ్య‌ర్థుల ఖ‌రారు.. అవకాశం ఉన్న స్థానాలు ఇవే..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలో జరగుతున్న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణలోని 17 స్థానాలపై చర్చ జరిగినప్పటికీ మూడు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 3-4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్‌ పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్టు తెలిసింది.

ఆదిలాబాద్: రమేశ్ రాథోడ్ లేదా సోయం బాపూరావు
(ఇక్కడ నగేశ్ పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఆ జిల్లా నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినట్టు సమాచారం)

మల్కాజిగిరి: మురళీధర్ రావు, ఈటల రాజేందర్, మల్క కొమురయ్య

ఖమ్మం: జి. వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారు

మహబూబాబాద్: హుస్సేన్ నాయక్ / సీతయ్య
(ఆదిలాబాద్ సీటు ఆదివాసీ నేతకు ఇస్తే ఇక్కడ బంజారా నేత – లేదంటే ఇక్కడ ఆదివాసీ నేత సీతయ్య పేరు పరిశీలించే అవకాశం)

- Advertisement -

వరంగల్: కృష్ణ ప్రసాద్ IPS / కళ్యాణ్ (యువనేత)
(కృష్ణ ప్రసాద్ విషయంలో ఆంధ్రా నేత అంటూ స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకత)

మెదక్: అంజిరెడ్డి / రఘునందన్

జహీరాబాద్: పరిశీలనలో దిల్ రాజు పేరు, ఆయన నిరాకరిస్తే జైపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు. అలాగే ఆలె నరేంద్ర కుమారుడు ఆలె భాస్కర్, 6టీవీ ఛైర్మన్ యేలేటి సురేశ్ రెడ్డి కూడా ఈ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

హైదరాబాద్: మాధవీలత పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం

మహబూబ్‌నగర్: డీకే అరుణ (దాదాపు ఫైనల్), లేదంటే జితేందర్ రెడ్డి (గట్టిగా పట్టుబడుతున్నారు)

నాగర్ కర్నూలు: పోతుగంటి రాములు

నల్గొండ: భాస్కర్ రావు / రామరాజు యాదవ్ (ఇంకా పార్టీలో చేరలేదు కాబట్టి అనుమానమే)

భువనగిరి: బూర నర్సయ్య గౌడ్ దాదాపు ఖరారు

పెద్దపల్లి: (పరిశీలనలో ఎస్. కుమార్, బొడిగె శోభ పేర్లు ఉన్నప్పటికీ.. ఇంకా పాపులర్ నేత కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు సాగిస్తోంది)

Advertisement

తాజా వార్తలు

Advertisement