Tuesday, May 21, 2024

యువత చేతుల్లోనే.. దేశ భవిష్యత్తు : ప్రధాని మోడీ

అంకురాల నుంచి ఆటల వరకు భారతీయ యువత సత్తా చాటుతున్నదని.. ప్రపంచ దేశాల్లో తనదైన ముద్రతో ముందుకు దూసుకెళ్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హస్తినలోని కరియప్పా గ్రౌండ్‌లో నిర్వహించిన నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్ (ఎన్‌సీసీ) ర్యాలీకి మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహించుకుంటున్న సమయంలోనే.. ఎన్‌సీసీ ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను కూడా ఎన్‌సీసీలో చురుకైన క్యాడెట్‌గా ఉండేవాణ్ని అని, ఇలా ఉన్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నట్టు తెలిపారు. ఎన్‌సీసీలో తాను నేర్చుకున్న శిక్షణ తనకు ఉపయోగపడుతున్నదని స్పష్టం చేశారు.

బలోపేతానికి చర్యలు..

ఎన్‌సీసీని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని మోడీ గుర్తు చేశారు. పెద్ద సంఖ్యలో బాలికల క్యాడెట్లు ర్యాలీకి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఈ రోజు భారతదేశం చూస్తున్న మార్పు అంటూ చెప్పుకొచ్చారు. మాతృభూమికి తిరిగి రుణం చెల్లించుకోవడానికి ఎన్‌సీసీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గత రెండేళ్ల కాలంలో.. లక్షకు పైగా కొత్త ఎన్‌సీసీ క్యాడెట్లు.. దేశ సరిహద్దులో చేర్చినట్టు వివరించారు. ఆర్మీలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు. ఇదే పరిస్థితి ఎన్‌సీసీలోనూ కనిపిస్తోందన్నారు. భద్రతా విభాగంలో.. మహిళలు ఎంతో కీలక బాధ్యతలు.. నెరవేరుస్తున్నారని చెప్పుకొచ్చారు.

మూలాలు మరిచిపోవద్దు..

దేశ భవిష్యత్తును మార్చే సత్తా కేవలం యువతకే ఉందని, అయితే వాటి మూలాలు మాత్రం మరిచిపోవద్దని సూచించారు. చాలా మంది యువత మత్తుకు బానిసై బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. దీనికి ముందు ఎన్‌సీసీ మార్చ్‌ ఫాస్ట్‌ను మోడీ తిలకించారు. ప్రతీ ఏటా 28వ తేదీన రిపబ్లిక్‌ డే సందర్భంగా జరిగిన క్యాంప్‌ ముగింపును నిర్వహిస్తారు. ఆర్మీ యాక్షన్‌, స్లిథరింగ్‌ మైక్రోలైట్‌ ఫ్లయింగ్‌, పారా పౖౖెలింగ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు తమ నైపుణ్యాలను ప్రధాని వీక్షించారు. అత్యుత్తం ప్రతిభ కనబర్చిన ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రధాని మోడీ పతకాలను ప్రదానం చేశారు. అయితే మోడీ ధరించిన సిక్కు క్యాడెట్‌ తలపాగా ఎంతో ఆకర్షణగా నిలిచింది. గార్‌ ్డ ఆఫ్‌ హానర్‌ను కూడా మోడీ పరిశీలించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement