Friday, May 3, 2024

తొలి వన్డే మనోళ్లదే! 4 వికెట్ల తేడాతో లంకపై ఘనవిజయం

శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా మహిళల జట్టు వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారంనాడు పల్లెకెలె వేదికగా జరిగిన తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో లంకపై గెలుపొందింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(44), సఫాలీ వర్మ (350, హర్లీన్‌ డియోల్‌ (34) రాణించారు. టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 48.2 ఓవర్లలో 171 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. లంక బ్యాటర్స్‌లో నీలాక్షి డి సిల్వా (43), హసిని పెరెరా (37), హర్షిత సమరవిక్రమ (28) రాణించగా, మిగిలిన వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

భారత బౌలర్లలో రేణుకా సింగ్‌, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, పూజ వస్త్రాకర్‌ 2, రాజేశ్వరి గైక్వాడ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. 172 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు షఫాలీ వర్మ (35) అద్భుతంగా రాణించగా, మరో ఓపెనర్‌ సృతి మందన (4) తీవ్ర నిరాశపరిచింది. వన్‌డౌన్‌లో వచ్చిన యస్టికా భాటియా(1) క్రీజులో నిలబడకుండానే వెనుదిరిగింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (44), షఫాలీ వర్మ, హర్లీన్‌ డియోల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. 38 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక బౌలర్లలో ఇనోకా రణవీర 4 వికెట్లు పడగొట్టగా, ఒసాది రణసింఘె 2 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement