Thursday, April 18, 2024

కేసీఆర్ ప్ర‌ధాని కావాలి : మంత్రి మ‌ల్లారెడ్డి

గ‌త మూడురోజులుగా స‌మ్మ‌క్క‌-సార‌క్క జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతోంది. అయితే ఈరోజు ప్ర‌ముఖులు స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌ను ద‌ర్శించుకొని ప‌లు కోర్కెల‌ను కోరుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ మేడారంలో తల్లులను దర్శించుకున్నారు. అయితే రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డి కూడా ఈరోజు రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి దేశానికి ప్రధాన మంత్రి కావాలని వనదేవతలను సమ్మక్క-సారలమ్మ తల్లులను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటి దాకా 10 ఏళ్ల నుంచి తాను కోరుకున్న కోరికలు సక్సెస్ అయ్యానని.. కేవలం ఇప్పడు ఒకే కోరిక కోరానని సీఎం కేసీఆర్ ను ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరకున్నానన్నారు. ఒక్క సారి ప్రైమ్ మినిస్టర్ ని చేస్తే.. భారత దేశం సస్యశ్యామలం అవుతుంద‌న్నారు. అందరికి తాగు, సాగు నీరు వస్తాయి, ఆసరా ఫింఛన్లు వస్తాయని..కరెంట్ వస్తుంది.. గురుకుల పాఠశాలలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయని.. మన తెలంగాణను ఎలా డెవలప్ మెంట్ చేశారో…భారత దేశాన్ని కూడా రెండేళ్లలో చేసి చూపిస్తారని.. త‌న మొక్కును వన దేవతలు తీరుస్తారని ఆయన విశ్వాసం వ్యక్త చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement