Thursday, April 25, 2024

మహీంద్రా నుంచి మొదటి ఈవీ

మహింద్రా అండ్‌ మహీంద్రా నుంచి మొదటి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ విడుదలైంది. ఎక్స్‌యువీ 400 ఈవీ కారును కంపెనీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర 15.99 లక్షలుగా కంపెనీ పేర్కొంది. ఎక్స్‌యువీ 400 ఈసీ, ఎక్స్‌యువీ 400 ఈఎల్‌ వేరియంట్లలో ఇది అభ్యమవుతుందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. ఈఎల్‌ వేరింట్‌లో 39.4 కిలోవాట్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో వస్తుంది. ఇది సారి ఛార్జ్‌ చేస్తే 456 కిలీమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 7.2 కిలోవాట్‌ ఛార్జర్‌ దీనితో ఇస్తారు. ఈసీ వేరియంట్‌లో 34.5 కిలోవాట్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 375 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. 8.3 సెకన్లలో ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఇది గరిష్టంగా గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. జనవరి 26 నుంచి 400 ఎక్స్‌యువీ ఈవీ బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. మొదటి దశలో 34 నగరాల్లో ఇది అందుబాటులో ఉంటుంది. తొలి సంవత్సరం 20 వేల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈఎల్‌ వేరియంట్‌ ఈ మార్చి నుంచి, ఈసీ వేరియంట్‌ దీపావళి నుంచి డెలివరీలు ఇస్తారు. రెండు వేరియంట్స్‌లో మొదటి 5 వేల బుకింగ్స్‌పై ప్రత్యేక ఆఫర్‌ ధర ఉంటుందని కంపెనీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement