Saturday, July 27, 2024

డేటా ప్రొటక్షన్‌ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం.. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం

కేంద్ర క్యాబినెట్‌ డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటక్షన్‌ డ్రాఫ్ట్‌ బిల్లును ఆమోదించింది. రానున్న పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఉల్లంఘనలకు పాల్పడే సంస్థలకు 250 కోట్ల వరకు ఫైన్‌ వేసేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించారు. పార్లమెంట్‌ వర్షకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కోసం జారీ చేసిన అంశాలన్నింటినీ ఈ బిల్లులో పొందుపరిచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వివాదం ఏర్పడితే డేటా ప్రొటక్షన్‌ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని బిల్లులో ప్రతిపాదించారు.

ప్రజలు సివిల్‌ కోర్టులో నష్టపరిహారం కోసం దావావేసుకునే హక్కును బిల్లు కల్పిస్తుంది. వ్యక్తులు ఎవరైనా డేటా సేకరణ, భద్రపరచడం, ప్రాసెసింగ్‌ వంటి అంశాపై వివరాలు కోరే హక్కును ఈ బిల్లు కల్పిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement