Wednesday, May 1, 2024

ఏనుగు తోక తెగ్గొట్టిన ఆగంతకులు.. నిందితుల కోసం కర్ణాటక అటవీ శాఖ వేట

సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా కొందరు దుండుగులు ఒక ఏనుగుపై దాడి చేసి దాని తోకను తెగ్గొట్టిన దారుణం కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో సక్రెబైలా ఏనుగుల క్యాంప్‌లో చోటు చేసుకుందని సంబంధిత వర్గాలు శుక్రవారం తెలిపాయి. 18 నెలల గర్భంతో ఉన్న భానుమతి అనే ఏనుగుకు తుంగ నదిలో స్నానం చేయించిన తర్వాత గ్రాజం మేయడం కోసం సిబ్బంది దానిని క్యాంప్‌ ఆవరణలో విడిచిపెట్టారు.

కాసేపటి తర్వాత వచ్చి చూసిన సిబ్బందికి ఏనుగు కింద రక్తం మడుగు కట్టి ఉండటం కనిపించింది. భానుమతి తోక తెగిపోయి ఉంది. ఆగంతుకులు ఒక పదునైన ఆయుధంతో భానుమతిపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు డివిజినల్‌ అటవీ అధికారి ప్రసన్నకృష్ణ పటాగర్‌ తెలిపారు. గాయం నుంచి భానుమతి కోలుకుందని, ఆరోగ్యంగా ఉందని, ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement