Sunday, April 21, 2024

త‌మిళ సూప‌ర్ స్టార్ ని క‌లిసిన విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్-వైర‌ల్ గా ఫొటోస్

అన్ని భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది విక్ర‌మ్ మూవీ. ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయడం విశేషం. మరోవైపు ట్రైలర్ లో అదిరిపోయే యాక్షన్స్ సీన్స్.. దద్దరిల్లిపోయేలా ఉన్న డైలాగ్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఈగర్ ఎదురుచూస్తున్నారు క‌మ‌ల్ హాస‌న్ ఫ్యాన్స్. ఇది ఇలా ఉండ‌గా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని క‌లిశారు విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్. దర్శకుడు లోకేష్‌ కనగరాజు తెర‌కెక్కిస్తోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం విక్ర‌మ్. కమల్ హాస‌న్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ర‌జ‌నీకాంత్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ .. కమల్ హాసన్ ..రజనీకాంత్ ను కలిసి బొకే అందించారు. తమ చిత్రం రిలీజ్ గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రజనీ కాంత్ చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. సినిమా విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం ఫొటోలకు ఫోజులిచ్చారు. రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ ను షేర్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement