Saturday, April 13, 2024

Telangana – పది మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం

తెలంగాణలో పది మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం కలిందింది. పది మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అడిషనల్‌ డీసీపీగా ఎన్‌ఎస్‌ మోహన్‌రాజా, రామగుండం అడిషనల్‌ డీసీపీ (ఆపరేషన్స్‌)గా వీ శ్యామ్‌బాబు, సౌత్‌జోన్‌ అడిషనల్‌ డీసీపీగా టీ స్వామి, ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ ఎస్పీగా ముత్యంరెడ్డి, జెన్‌కో అడిషనల్‌ ఎస్పీగా డీ ప్రతాప్‌, తెలంగాణ స్టేట్‌ పోలీస్ అకాడమీ అడిషనల్‌ ఎస్పీగా ఆర్‌ సుదర్శన్‌ను నియమించారు. అక్టోపస్‌ అడిషనల్‌ ఎస్పీగా కే గంగారెడ్డి, హైదరాబాద్‌ సిటీ-1 అడిషనల్‌ డీఎస్పీగా ఎస్‌ రంగారావు, భూపాలపల్లి అడిషనల్‌ డీసీపీగా నరేశ్‌కుమార్‌, అక్టోపస్‌ అడిషనల్‌ ఎస్పీ హనుమంతరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement