Thursday, April 25, 2024

మహిళలపై తాలిబాన్‌ మళ్లి కొరడా.. యూనివర్శిటీ ప్రవేశ పరీక్షకు అనుమతి నిరాకరణ

దేశాధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్గాన్‌ మహిళల స్వేచ్ఛా, హక్కులపై తాలిబాన్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కఠిన ఆంక్షలతో వారిని విద్యకు దూరం చేస్తున్నారు. ఇంతకు ముందే ఆఎn్గాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాల విద్యపై ఉక్కు పాదం మోపి, కఠిన ఆంక్షలు కొనసాగుతుండగా.. తాజాగా విశ్వవిద్యాలయ ప్రవేశపరీక్షకు మహిళలు హాజరుకాకుండా తాలిబన్‌ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. నిషేధన ఉత్తర్వులను దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి ప్రవేశ పరీక్షకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఆఎn్గాన్‌ మహిళలకు ఉండదు.

- Advertisement -

ప్రభుత్వేతర కార్యాలయాల్లో మహిళల్ని పని చేయకుండా నిషేధం విధించి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శల్ని, అపఖ్యాతిని మూటకట్టుకున్న తాలిబన్‌ ప్రభుత్వం తాజా నిర్ణయంతో తన నియంతృత్వ పాలనను మరోసారి బహిర్గతం చేసుకుంది. మహిళలకు విశ్వవిద్యాలయ చదువుల్ని దూరం చేస్తూ తాలిబన్‌ ప్రభుత్వం నిరవధిక నిషేధం నిర్ణయంపై మానవతా సంస్థలు ఆందోళన చేపట్టాయి.

ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌ గత నెల సమావేశమై ఆఫ్గాన్‌లో అమలవుతున్న మహిళా విద్యా వ్యతిరేక కార్యకలాపాలకు తీవ్ర నిరసన తెలిపింది. తాలిబన్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని పలు ఇస్లామిక్‌ దేశాలు కూడా ఖండించాయి. తాలిబన్‌ ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎన్నో చట్టాలను అమల్లోకి తెచ్చింది. మహిళలు పార్కులు, జిమ్‌లు వాడకుండా నిషేధం విధించింది. తాజా నిర్ణయం మహిళా హక్కుల అణిచివేతే అని ప్రపంచ దేశాలు విమర్శించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement