Wednesday, May 1, 2024

సువేద్‌ పార్కర్ డబుల్‌ సెంచరీ.. రంజీ మ్యాచ్‌లో మెరిసిన యువకెరటం..

రంజీ ఆరంగేట్రంలోనే సువేద్‌ పార్కర్‌ డబుల్‌ సెంచరీ చేసి అందరినీ అబ్బురపరిచాడు. బెంగళూరులో వేదికగా నిర్వహిం చిన మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌ జట్టుతో ముంబై ఆటగాడు తలపడ్డాడు. గతంలో స్టేట్‌ టీం హెడ్‌ అమోల్‌ మజుందార్‌ ఈ ఘనతను తన సొంతం చేసుకున్నాడు. సువేద్‌ తన దినేశ్‌ లాడ్‌ వద్ద సువేద్‌…శిక్షణ పొందాడు. వాస్తవానికి రోహిత్‌ శర్మ చిన్ననాటి నుంచే దినేశ్‌ వద్ద క్రికెట్‌లో మెలకువలు నేర్చుకున్నాడు. రంజి క్వార్టర్‌ ఫైనల్‌ సందర్భంగా రెండో రోజున రెండు వందల పరుగులు తీశాడు. ఆరంగేట్రంలోనే అత్యంత ప్రతిభావంతంగా ఆడి రెండు శతకాలు కొట్టడం ద్వారా అందరినీ అబ్బు రపరిచాడు. కాగా ఫరీదాబాద్‌ పట్టణంలో 1993-94లో నిర్వహించిన మ్యాచ్‌లో 260 పరుగులు తీసి ఔరా అనిపించాడు. ఈ ఏడాది ఆరంభంలో మిజోరాంలో నిర్వహించిన మ్యాచ్‌లో బిహార్‌కు చెందిన సకిబల్‌ గని అత్యధికంగా మూడు వందల పరుగులు తీశాడు.

రంజీ క్రికెట్‌ అంటే దేశవాళీగా ఎనలేని క్రేజ్‌ ఉంది. టీం ఇండియాలో అడుగుపెట్టాలనుకునే ఏ ఆటగాడైనా ఇందులో సత్తా చాటాల్సిందే. అయితే ఇప్పుడు ఐపీఎల్‌ వంటి లీగ్‌ల పుణ్యమా అని అనేకమంది క్రీడాకారులు, యువ క్రికెటర్లకు అవకాశం లభిస్తోంది. ఒకనాడు అందరికీ రంజీయే అసలైన వేదిక. తాజా రంజీలో భాగంగా ముంబై, ఉత్తరాఖండ్‌ మధ్య జరిగింది. టాస్‌ గెలుచుకుని బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబైకి ఆరంభంలో ఎదురు దబ్బ తగిలింది, ఓపెనర్లు ప్రధ్వీషా. యశస్వి జైస్వాల్‌ తక్కువ స్కోరుతోనే వెను దిరిగారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు సువేద్‌ పార్కర్‌. పేరు కొత్తగా వింటు న్నప్పటికీ రహానే స్థానంలో సువేద్‌ అడుగుపెట్టాడు. గాయంతో దూరమైన రహానే విలువ తెలియకుండా బ్యాటింగ్‌ను కొనసాగించాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీ చేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement