Sunday, April 28, 2024

Delhi : కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్… విచార‌ణ ఏప్రిల్ 30కి సుప్రీం కోర్టు వాయిదా

కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రం రిలీజ్ చేసిన గెజిట్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నోటిఫికేష‌న్ ను త‌క్ష‌ణం ర‌ద్దు చేయాల‌ని కోరింది..ఈ పిటిషన్ ను మంగ‌ళ‌వారం నాడు జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారించింది.. అనంత‌రం కేసు విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.

- Advertisement -

ఇది ఇలా ఉంటే ఏపీ విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణ పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేశారు. ఇది తాత్కాలిక పంపిణీ మాత్రమే. ఆ తర్వాత విభజన చట్టం కింద నీటి పంపకాలపై కేంద్రం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డే కృష్ణనది నీటిని రెండు రాష్ట్రాలకు పంచుతోంది. అయితే కొత్తగా నీటి పంపకాలు చేపట్టాలని తెలంగాణ కేంద్రాన్ని కోరింది. గతంలో వెలువరించిన తీర్పుల సమయంలో తెలంగాణలేదు కాబట్టి.. తెలంగాణ వాదన వినేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని వాదించింది. అందుకోసం కొత్తగా ట్రిబ్యునల్ వేయాలని 2014లో కేంద్రానికి లేఖ రాసింది. లేదంటే ఉన్న ట్రిబ్యునలే కొత్తగా నీటి పంపకాలు చేయాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం తెలంగాణ డిమాండ్ ను అంగీకరించిన కేంద్రం.. కొత్త ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల పున:పంపిణీ 2023 అక్టోబర్ లో కేంద్రం జారీ చేసిన గెజిట్ రిలీజ్ చేసింది. దీనిని వ్యతిరేకించిన ఏపీ సర్కార్ కృష్ణా ట్రిబ్యునల్‌-2 టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీవోఆర్‌) అంశంపై ముందుకు వెళ్లకుండా స్టే ఇవ్వాలంటూ అప్లికేషన్ ఫైల్ చేసింది. స్టేకు నిరాక‌రించిన సుప్రీం త‌దుప‌రి విచార‌ణ‌ను ఏప్రిల్ 19 కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement