Wednesday, February 28, 2024

వాజేడు హాస్పిట‌ల్‌ని త‌నిఖీ చేసిన రాష్ట్ర‌ హెల్త్ ఆఫీస‌ర్‌.. వైద్య సేవ‌ల‌పై సంతృఫ్తి

వాజేడు, (ప్రభ న్యూస్) : రాష్ట్ర మెడిక‌ల్ అండ్ హెల్త్‌ అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్ ఇవ్వాల (శుక్ర‌వారం) ములుగు జిల్లాలోని వాజేడులో ప‌ర్య‌టించారు. అక్క‌డి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నితనిఖీ చేశారు. వైద్య పరంగా అందుతున్న సేవల గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. కష్ట కాలంలో అందిస్తున్న సేవలపై ట్రీట్‌మెంట్ పొందుతున్న వారు హ్యాపీగా ఉండ‌డంతో సంతృప్తి వ్యక్తం చేశారు. సేవా భావంతో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని ప్రశంసించారు. రికార్డులను పరిశీలించి వైద్యాధికారులకు, సిబ్బందికి తగు సూచనలు.. సలహాలు అందించారు. సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టి మెరుగైన‌ వైద్యం అందించాలన్నారు. హాస్పిట‌ల్‌లో డెలివరీ అయిన మహిళలకు కేసీఆర్ కిట్ అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అప్పయ్య, వాజేడు వైద్యాధికారి వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement