Saturday, July 13, 2024

ఈ నెల 12న ఎల్‌బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల (ఏప్రిల్) 12న ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 12 సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు అధికారికంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన కార్యదర్శి భూపాల్‌రెడ్డిని ఆదేశించారు. ఈ ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిర్వహించనుంది. ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం మతపెద్దలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజలు చేరనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement