Thursday, May 2, 2024

AFG Vs SL | శ్రీలంక చిత్తు.. అఫ్గానిస్థాన్ ఖాతాలో మరో సంచలనం విజయం..

ఐసీసీ వ‌న్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవ్వాల (సోమ‌వారం) పూణే వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ మ‌రో సంచ‌ల‌నం సృష్టించంది. ప్రపంచకప్‌లో నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై 7 వికెట్ల‌ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు అఫ్గాన్ బౌలర్ల ధాటికి స్వల్ప పరుగులకే పరిమితమైంది. ఇక‌, ఛేజింగ్ లోనూ రాణించి అఫ్గానిస్థాన్ మరో విజయాన్ని అందుకుంది.

అఫ్గానిస్థాన్ బ్యాటర్ల‌లో.. ఇబ్రహీం జద్రాన్ (39) పరుగులు చేయగా., రహ్మత్ షా (62), హష్మతుల్లా షాహిదీ 58 (నాటౌట్), అజ్మతుల్లా ఒమర్జాయ్ 73 (నాటౌట్) హాఫ్ సెంచరీలతో అదరకొట్టారు.

- Advertisement -

ఇక‌, అంత‌క ముందు బ్యాటింగ్ శ్రీలంక బ్యాటర్లలో.. దిముత్ కరుణరత్నే (15), పాతుమ్ నిస్సాంక (46), కుసాల్ మెండిస్ (39), సదీర సమరవిక్రమ (36), చరిత్ అసలంక (22), ధనంజయ డి సిల్వా (14) ఏంజెలో మాథ్యూస్ (23), మహేశ్ తీక్షణ (29) ప‌రుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement