Sunday, October 13, 2024

Delhi | భద్రత వైఫల్యం.. కేరళ గవర్నర్​ కాన్వాయ్​ని ఢీకొట్టిన స్కార్పియో!

కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​కి విచిత్ర ఘటన ఎదురయ్యింది. నోయిడాలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై ఢిల్లీకి వెళ్తుండగా అతని కాన్వాయ్​ని ఓ స్కార్పియో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఒక్కసారి కాదు.. ఇట్లా రెండు సార్లు జరిగిసరికి అంతా భయపడ్డారు. సెక్యూరిటీ ఉల్లంఘన కింద కారులో ఉన్న నిందితులను, కారుని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శుక్రవారం రాత్రి నోయిడాలో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఆయన కాన్వాయ్‌పైకి వేగంగా దూసుకొచ్చిందో కారు. కాన్వాయ్​లోని వాహనాన్ని ఢీకొట్టడంతో ఆయన భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు కాన్వాయ్‌ను ఢీకొన్నందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

అయితే.. కారులో ఉన్న ఇద్దరూ ఫుల్​గా తాగి ఉన్నారని తెలుస్తోంది. వేగంగా వచ్చిన వాహనం గవర్నర్ కాన్వాయ్‌ను రెండుసార్లు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి నల్లటి స్కార్పియో కారును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను ఘజియాబాద్‌కు చెందిన గౌరవ్ సోలంకి, మోను కుమార్‌గా గుర్తించారు. సెక్టార్ 77లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నోయిడా వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement