Thursday, May 2, 2024

ISRO | త్వరలో శుక్రయాన్‌.. ఇస్రో తదుపరి మిషన్‌పై సోమనాథ్‌ ప్రకటన

చంద్రయాన్‌ -3, ఆదిత్య ఎల్‌-1 (సూర్యయాన్‌) ప్రయోగాల వరుస విజయాలతో ఇస్రో తదుపరి ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. త్వరలో మరో కొత్త మిషన్‌ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈసారి శుక్ర గ్రహం మీద అన్వేషణలకు ముందడుగు వేయనుంది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ స్వయంగా వెల్లడించారు. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్ర#హమైన వీనస్‌ (శుక్రుడు) కోసం భారత్‌ మిషన్‌ సిద్ధమైందని తెలిపారు. ఈ మిషన్‌కు సంబంధించిన పేలోడ్‌ను ఇప్పటికే అభివృద్ధి చేసినట్లు తెలియజేశారు.

ఢిల్లిలోని ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఐమా) 50వ జాతీయ నిర్వ#హణా సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ సోమనాధ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ”మా దగ్గర చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. అయితే.. వీనస్‌కు మిషన్‌ ఇప్పటికే ప్రణాళిక చేయబడింది. దీనికోసం ఇప్పటికే పేలోడ్స్‌ని అభివృద్ధి చేయడం జరిగింది. వీనస్‌ ఒక ఆసక్తికరమైన గ్రహం. దీనిని అన్వేషించడం వల్ల అంతరిక్ష శాస్త్ర రంగంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి” అని అన్నారు. వీనస్‌కి వాతావరణం ఉంటుందని, అది ఎంతో దట్టమైనదని పేర్కొన్నారు. అక్కడి వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ గ్ర#హం మొత్తం యాసిడ్‌తో నిండి ఉంటుందని, దాని ఉపరితలంపై ఎవరూ ప్రవేశించలేరని వెల్లడించారు.

శుక్రుడిపై భూ వాతావరణం?
శుక్రుడి ఉపరితలం గట్టిగా ఉందో లేదో ఎవరికీ తెలియదన్న సోమనాథ్‌.. వీనస్‌ మిషన్‌ చేపట్టడం వెనుక గల ప్రధాన కారణాన్ని బయటపెట్టారు. భూమి కూడా ఒకప్పుడు శుక్రుడు గ్ర#హంలాగే ఉండొచ్చన్న సందేహాన్ని వ్యక్తపరిచారు. 10,000 సంవత్సరాల తర్వాత భూమి తన లక్షణాలను మార్చుకునే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. భూమి ఎప్పుడూ ఇలా ఉండేది కాదని, చాలాకాలం క్రితం ఇది నివాసయోగ్యమైన ప్రదేశం కాదని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ని వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అంతరిక్షంలో అపార అవకాశాలు

- Advertisement -

భారత అంతరిక్ష రంగంలో అప్లికేషన్‌, సర్వీసులు, తయారీ విభాగాల్లో అపార అవకాశాలున్నాయని ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌ పేర్కొన్నారు. అమృత్‌ కాలంలో అడుగుపెట్టిన క్రమంలో మన ఎకానమీలో స్పేస్‌ రంగం వాటా పెరిగిందని స్పష్టం చేశారు. ఇది కేవలం రాకెట్ల తయారీ, శాటిలైట్ల నుంచే కాకుండా భారత్‌లో అప్లికేషన్ల నిర్మాణం, సర్వీసులు, తయారీ విభాగాల నుంచి అపార అవకాశాలు, సామర్ధ్యం అందివస్తున్నాయని తెలిపారు. స్పేస్‌ రంగం ద్వారా చేపడుతున్న హపర్‌లోకల్‌ వాతావరణ అప్‌డేట్‌ సేవలు, మ్యాప్‌ సర్వీసులు, రిమోట్‌ సెన్సింగ్‌, కమ్యూనికేషన్‌ అప్లికేషన్స్‌ వంటివి ముందుకు వచ్చిన తీరును ఉద#హరించారు. ఈ దిశగా మనం సరైన ఇకోసిస్టమ్‌ను సృష్టిస్తున్నామని ఇస్రో చీఫ్‌ పేర్కొన్నారు. ఇక భారత అంతరిక్ష ఆర్ధిక వ్యవస్ధ మొత్తం జీడీపీలో 1.8 శాతంగా ఉంటుందని అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement