Friday, May 3, 2024

National : ఇక్క‌డ పోటీచేయ‌డ‌మేంటీ…రాహుల్‌గాంధీ పై స్మృతి ఇరానీ సెటైర్లు..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ సెటైర్ వేశారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కె. సురేంద్రన్‌కి మద్దుతగా స్మృతి ఇరానీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీ మే హగ్గింగ్‌, కేరళ మే బెగ్గింగ్, కర్ణాటక మే థగ్గింగ్‌ అంటూ సెటైర్లు వేశారు.

- Advertisement -

రాహుల్ వయనాడ్ లో ఎందుకు పోటీ చేస్తున్నాడు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు కదా అని ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలే ప్రశ్నిస్తున్నాయని అన్నారు. వయనాడ్ లో రాహుల్ గాంధీ పోటీ చేయడాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ తప్పబట్టాడు అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గుర్తు చేశారు.

మహిళలు భారీ సంఖ్యలో బీజేపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఓట్లు వేయడం ఏ టీవీ సీరియల్‌ల ఆట కాదు.. ఇది ఒక భారీ బాధ్యత, ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో మహిళలను సీరియస్‌గా తీసుకోవాలనుకుంటే.. మనం ముఖ్యమైన రాజకీయ విషయాలపై దృష్టి పెట్టాలని ఆమె మహిళలందరినీ కోరారు. ‘సాస్-బాహు’ సీరియల్స్ జీవిత వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement