Sunday, May 26, 2024

విగ్గులో తీసుకెళ్తున్న బంగారం సీజ్

బంగారంను అక్రమంగా తరలించేందుకు అక్రమార్కులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల ద్వారా అక్రమమార్గంలో తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూ పట్టుబడుతున్నారు. షూస్ మొదలుకొని జీన్ ప్యాంట్ లు, ట్యాబ్లెట్లు, ఫైల్ ఫోలర్లు వేటీనీ వదిలిపెట్టడం లేదు. ఇంకొందరైతే కడుపులో దాచుకొని తీసుకెళ్తుండగా పట్టుబడిన సందర్భాలున్నాయి. తాజాగా చెన్నై ఎయిర్ పోర్టులో ఓ మహిళ వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.

చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ తనిఖీల్లో 23 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఓ మహిళ తల విగ్గులో బంగారం దాచి గుట్టుగా తప్పించుకుందామని ప్లాన్ వేసుకుంది. అయితే కస్టమ్స్ అధికారుల ముందు ఆమె ఆటలు సాగలేదు. చెన్నై కస్టమ్స్ అధికారులు విగ్గులో దాచిన బంగారంను స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి చెన్నైకి విమానంలో తలవెంట్రుకల్లో విగ్గులో దాచుకున్న 23 లక్షల విలువైన 525 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుకి సంబంధించి ముగ్గురు మహిళలను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement