Tuesday, June 4, 2024

ICC | బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌కు షాక్‌.. రెండేళ్ల నిషేధం !

బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ నాసిర్ హొస్సేన్ కు ఐసీసీ భారీ షాకిచ్చింది. అత‌డిపై రెండేళ్లపాటు ఏ ర‌క‌మైన అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేదం విధించింది. అవినీతి నిరోధ‌క నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలపింది ఐసీసీ. ఈ నిషేదం కార‌ణంగా 2025 ఏప్రిల్ 7 వ‌ర‌కు నాసిర్ హొస్సేన్ అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వీలులేదు.

నిషేదనికి కారణం ఇదే !

అబుదాబి టీ10 లీగ్ 2020-21 ఎడిషన్‌లో అత‌డు పూణే డెవిల్స్ ఫ్రాంచైజీ త‌రుపున ఆడాడు. ఆ స‌మ‌యంలో మ‌రో ఏడుగురితో క‌లిసి నాసిర్ హొస్సేన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై ఐసీసీ 2023 సెప్టెంబ‌ర్‌లో విచార‌ణ ప్రారంభించింది. విచార‌ణ‌లో అత‌డు ఫిక్సింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు తెలింది. ఆ ఫిక్సింగ్‌లో అత‌డికి ఖ‌రీదైన ఐఫోన్ 12 బ‌హుమ‌తిగా అందిన‌ట్లు తెలిసింది. ఇక ఫిక్సింగ్‌కు సంబంధించి బుకీలు సంప్ర‌దించిన విష‌యాల‌ను ఏ ద‌శ‌లోనూ అత‌డు ఐసీసీ అధికారుల‌కు తెలియ‌జేయ‌లేదు. విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో అత‌డిపై నిషేదం విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement