Tuesday, July 23, 2024

TS | అయుర్వైద్యంలో సైన్స్ డెవలప్ అయ్యింది: వీసీ సజ్జనార్

మయూర ఆయుర్వేద, సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ మొదటి వార్షికోత్సవం సందర్భంగా హ్యాపీ పేషెంట్స్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది కాలంలో మయూరలో వైద్యం పొంది ఆరోగ్యవంతులుగా మారిన ఎంతో మంది పేషెంట్స్‌ ఈ సందర్భంగా తమ ఆనందాన్ని, అభినందనలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా హెల్త్‌ క్యాంప్‌కు అద్భుత స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రావాల్సి ఉన్నా, వివిధ కారణాలతో రాలేకపోయాయని తన అభినందనలను సంస్థకు, సిబ్బందికి తెలియజేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండి, వైస్‌ ఛైర్మన్‌ వి.సి. సజ్జనార్‌. ఆయుర్వేదం అంటే కేవలం మసాజులు, థెరపీలు కానే కావని, ఈ వైద్య విధానంలో కూడా సైన్స్‌ ఎంతగానో అభివృద్ధి చెందిందని ఆయన వివరించారు.

హెల్త్‌ క్యాంప్‌కు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక నుంచి కూడా పెద్ద ఎత్తున పేషెంట్లు హాజరయ్యారు. సంస్థ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర ఆయుర్వేద, సిద్ధ హాస్పిటల్‌ ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది. డయాబెటిస్‌ సహా వివిధ నొప్పుల నిర్వాహణ అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మొదటి ఏడాదిలోనే సుమారు మూడు వేల మంది పేషెంట్ల అభిమానాన్ని చూరగొన్న సంస్థ, త్వరలో ఇన్‌ పేషెంట్‌ సేవలను కూడా ప్రారంభించబోతోంది.

ఇదే ఉత్సాహంతో జనాలకు అందుబాటులో ధరలో వైద్యం అందించడం ఒక్కటే తమ లక్ష్యమని మయూర ఆయుర్వేద, సిద్ధ హాస్పిటల్‌ ఫౌండర్‌ హను యెడ్లూరి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ సిద్ధ వైద్యులు డా. అర్జునన్‌, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. జిఆర్ఆర్‌ చక్రవర్తి గారు హాజరయ్యారు. వీళ్లద్దరికీ తమ తమ రంగాల్లో సుమారు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఇద్దరూ పీహెచ్‌డీలు చేయడంతో పాటు ఎన్నో పుస్తకాలు కూడా రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement