Sunday, February 25, 2024

CRICKET GOD : ఆఫ్ మారథాన్‌ను ప్రారంభించిన క్రికెట్ దిగ్గజం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ ఉద‌యం నిర్వహించిన హైదరాబాద్ ఆఫ్ మారథాన్‌కు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 20కే, 10కే, 5కే విభాగాల్లో నిర్వహించిన ఈ మారథాన్‌లో బ్యాడ్మింటన్ దిగ్గజం, కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా పాల్గొన్నాడు.

ఈ మారథాన్‌లో వయసుతో పనిలేకుండా దాదాపు 8 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఉదయం 5.15 గంటలకే 21.1కే రన్ ప్రారంభం కాగా, ఆ తర్వాత 10కే, 5కే రన్ ప్రారంభమయ్యాయి. ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మారథాన్ కార్యక్రమానికి దాని బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ టెండూల్కర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement