Saturday, May 11, 2024

పార్టీలో అంతర్గత సమస్యలుంటే అధిష్టానం పరిష్కరిస్తుంది: షబ్బీర్ అలీ

రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. ఇక ఎంపీ రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంపై షబ్బీర్ అలీ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రేవంత్ బలంగా పోరాడుతారన్నారు. పార్టీలోని అంతర్గత సమస్యలు అన్నీ త్వరలోనే సమసిపోతాయన్నారు. పార్టీలో ఏమైనా సమస్యలుంటే అధిష్టానం పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు. రేవంత్ అందరిని కలుపుకుని పనిచేస్తారని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేస్తూ మీడియా ముందు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement