Sunday, May 19, 2024

ఫెఫ్సీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఆర్కే సెల్వ‌మ‌ణి నామినేష‌న్.. ఏక‌గ్రీవ ఎన్నిక

ప్ర‌తి మూడుఏళ్ల‌కి ఒక‌సారి ఫెఫ్సీ అంటే సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ వ‌ర్క‌ర్స్ ఫెడ‌రేష‌న్ కొత్త ఎగ్జిక్యూటివ్ ల‌ను ఎన్నుకొనేందుకు ఎల‌క్ష‌న్స్ ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ద‌ర్శకుడు ఆర్కే సెల్వ‌మ‌ణి నేతృత్వంలోని నిర్వాహ‌కుల ప‌ద‌వీకాలం ముగిసిపోనుంది. ఈ మేరకు 23న చెన్నై వడపళనిలోని సంఘం కార్యాలయంలో ఎన్నిక జరగనుంది. ఈ అధ్యక్ష పదవికి ఆర్కే సెల్వమణి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన తాజాగా నామినేషన్ దాఖలు చేశారు.అయితే అధ్యక్ష పదవికి ఆర్కే సెల్వమణి ఒక్కరే పోటీ చేయడంతో ఆయన ఏకగ్రీవంగా గెలిచారు. జనరల్ సెక్రటరీ పదవికి ఆయన బృందం తరపున ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ సెక్రటరీ స్వామినాథన్, డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెంథిల్ కుమార్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షుల పదవికి శబరిక్రిషన్, దిన, మోహన మహేంద్రన్, తవసిరాజ్, మారి, సంయుక్త కార్యదర్శుల పదవికి రామలింగం, పురుషోత్తమన్, సజిత, రాజరత్నం, రామచంద్రన్ పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో పెప్సీ సంస్థకు అనుబంధంగా ఉన్న 24 సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో సహా కార్యనిర్వాహకులు ఓటు వేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement