Sunday, February 25, 2024

Results Day – నేడే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ ఎన్నికల కౌంటింగ్

సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్ ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. తెలంగాణ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి..

ఉదయం 8 గంటలకు తపాలా బ్యాలెట్లతో మొదలయ్యే ఓట్ల లెక్కింపునకు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిజోరంలో మాత్రం సోమవారం లెక్కింపు జరగనుంది. కర్ణాటకలో అధికారాన్ని బీజేపీ నుంచి హస్తగతం చేసుకున్న విధంగానే ఈసారి మధ్యప్రదేశ్, తెలంగాణల్లో విజయబావుటా ఎగరేసి, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. బీజేపీ కూడా గుజరాత్ మాదిరిగా మధ్యప్రదేశ్లోనూ కమలం మళ్లీ వికసిస్తుందని గట్టి ఆశలు పెట్టుకుంది.

ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. వాటి లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణలో ఇవాళ వైన్ షాపులు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement