Sunday, April 21, 2024

National : ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబాటు…. సభ్యత్వం రద్దు…

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు ​కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యింది.కాంగ్రెస్ పిటిషన్‌ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్‌పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేంద్ర భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్‌పాల్ తదితరులు సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌ను రాష్ట్ర బడ్జెట్‌ సమావేశంలో ఇతర సభ్యులు లేవనెత్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement