Sunday, May 19, 2024

ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్- విశ్వక్ సేన్ పై ప్రశంసలు

రాజమండ్రిలో ఓరి దేవుడా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ స్టేజ్ పై చరణ్ మాట్లాడుతూ .. చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో మీరంతా రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. మంచి సినిమాను ఆదరించే మీ గుణాన్ని మరోసారి చాటుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తుండగా..హీరో వెంకటేశ్ ఓ ముఖ్యపాత్రని పోషిస్తున్నారు. వెంకటేశ్ గారు కామెడీ ఎంత బాగా చేస్తారనేది అందరికీ తెలుసు. ఆయన చూపించే ఇంపాక్ట్ బలంగా ఉంటుందని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన కోసమైనా నేను ఈ సినిమాను చూస్తానన్నారు చరణ్. మిథిలా పాల్కర్ గురించి మీకు తెలియదేమో. తను ఓటీటీ సూపర్ స్టార్. నేను .. ఉపాసన ఇద్దరం కూడా తన ఫ్యాన్స్. ఆమె చేసిన ‘లిటిల్ థింగ్స్’ అనే సిరీస్ ను మేం ఫాలో అయ్యేవాళ్లం.విష్వక్సేన్ .. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ప్రాంతాల్లోని గల్లీ గల్లీలో ఈ పేరు తెలియని వారు లేరు. ఫలక్ నుమా నుంచి రాజమండ్రి వరకూ ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. విష్వక్ సేన్ కి రెబల్ ఫ్యాన్స్ .. రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. విష్వక్ పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఇచ్చిన మాటపై నిలబడే వాళ్లంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక పేరు నాకు ఉంది. విష్వక్ కూడా అంతే అనే విషయం నాకు తెలిసింది. ఒక రజనీకాంత్ .. చిరంజీవి .. పవన్ కల్యాణ్ సూపర్ స్టార్ లు అనిపించుకోవడానికి కారణం వారి వ్యక్తిత్వమే. అలాంటి పర్సనాలిటీ విష్వక్ సేన్ కి నిండుగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement