Friday, March 1, 2024

రజనీకాంత్ కొత్త ప్రాజెక్ట్ .. లాల్ సలాం .. నిర్మాతగా కుమారై

వయస్సుతో పనిలేకుండా మంచి ఎనర్జిటిక్ గా ఉంటారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌..సినిమా హిట్టా..ఫట్టా అనే దానితో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్టులని లైన్ లో పెడుతూ తనదైనశైలిలో దూసుకుపోతున్నాడు. కాగా రజనీకాంత్ మరో కొత్త ప్రాజెక్ట్‌ ను ప్రకటించారు. లాల్‌ సలాం అనే కొత్త సినిమాను రజనీకాంత్ చేస్తున్నారు. ఈ మేరకు లైకా నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది. ఈ సినిమాకు రజినీకాంత్‌ కూతురు ఐశ్వర్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా..ఈ సినిమాకి ఎఆర్‌ రెహామాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement