Tuesday, May 14, 2024

పుతిన్‌కు ప్రాణభయం.. విష ప్రయోగం చేస్తారని అనుమానం

ఉక్రెయిన్‌తో యుద్ధం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రాణసంకటంగా మారింది. ప్రపంచ దేశాల్లో అధిగభాగం పుతిన్‌ చర్యను నిర్ద్వందంగా ఖండించాయి. అదే సమయంలో స్వదేశంలోనూ వేలాది మంది వ్యతిరేక గళం వినిపించారు. సొంత ప్రభుత్వంలోనూ ఆయన వైఖరిపట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న పుతిన్‌కు ప్రాణభయం పట్టుకుందని ప్రచారం జరుగుతోంది. తనపై విష ప్రయోగం జరుగుతుందేమో అని ఆయన సందేహిస్తున్నట్లు సమాచారం. తాజా చర్యలు ఈ వాదనను బలపరుస్తున్నాయని డైలీ బీస్ట్‌ కంట్రిబ్యూటింగ్‌ ఎడిటర్‌ క్రెయిగ్‌ కోపెటాస్‌ పేర్కొన్నారు. పుతిన్‌ రోజూ భోజనం చేసేముందు, ఆహారపదార్థాలను తన సిబ్బందికి రుచి చూపిస్తున్నారని చెప్పారు. గత నెలలో 1000 మంది వ్యక్తిగత సిబ్బందిని తొలగించి, కొత్తవారిని నియమించినట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో లాండ్రీస్‌, సెక్రటరీలు, కుక్‌లును తొలగించారని కోషెటాస్‌ చెప్పారు.

రష్యాలో హత్యకు అనుసరించే పద్ధతి విషప్రయోగమేనని వెల్లడించారు. 2006లో పుతిన్‌ ఏజెంట్లు టీ కప్‌లో రేడియోధార్మిక విషాన్ని కలపడం ద్వారా ఆనాటి బహిరంగ విమర్శకుడు అలెగ్జాండర్‌ లిట్వినెంకోను చంపారు. 2018లో మాజీ గూఢచారి సెర్గీ స్కిపాల్‌ తలుపు మీద పుతిన్‌ అనుచరులు ఘోరమైన విషపదార్థాన్ని వెదజల్లారు. అదృష్టవశాత్తు సెర్గీ అతని కుమార్తె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇక ప్రతిపక్ష నేత నావల్నీ అలెక్సీపైనా విషప్రయోగం చేయాలని పుతిన్‌ ఆదేశించినట్లు ఆరోపణలున్నాయి. పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ నియంత మతిస్థిమితం కోల్పోయినట్లు అనిపిస్తోందని, అతని అంతర్గత సర్కిల్‌లోని వ్యక్తులు తనపై విష ప్రయోగం చేస్తారని భీతిల్లుతున్నాడని తాజా నివేదిక పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement