Friday, May 3, 2024

జిన్నా మూవీ ప్ర‌మోష‌న్స్- బిజీగా మంచు విష్ణు

హీరో మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం జిన్నా. ఈ చిత్రాన్ని ఇషాన్ సూర్య తెర‌కెక్కిస్తున్నాడు.కాగా ఈ మూవీలో
పాయ‌ల్ రాజ్‌పుత్, బాలీవుడ్ భామ స‌న్నీలియోన్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 21న గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. కాగా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మంచు విష్ణు టీం ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. విష్ణు, పాయ‌ల్‌, కోన వెంక‌ట్ అండ్ డైరెక్ట‌ర్ టీం క‌లిసి వివిధ ప‌ట్ట‌ణాల్లో తిరుగుతోంది. ప్ర‌మోష‌నల్ టూర్‌లో భాగంగా రాజ‌మండ్రి, కాకినాడ‌, శ్రీకాకుళం, వైజాగ్ ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. స్టూడెంట్స్ ఆఫ్ గ‌ని మెడిక‌ల్ కాలేజ్‌, ఆదిత్య కాలేజీ, చైత‌న్య‌, అవంతితోపాటు ప‌లు కాలేజీలకు వెళ్లింది చిత్ర‌యూనిట్‌. వెళ్లిన ప్ర‌తీ చోట విష్ణు టీంకు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు స్టూడెంట్స్ అండ్ మూవీ ల‌వ‌ర్స్‌. ప్ర‌మోష‌న‌ల్ టూర్ అనంత‌పూర్‌, క‌డ‌ప‌, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, విజ‌య‌వాడ పట్ట‌ణాల్లో కూడా కొన‌సాగ‌నుంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, నరేశ్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, సునీల్‌ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement