Sunday, May 19, 2024

ప్రొసెసింగ్ ప్లాంట్ వ‌స్తున్నాయి..

అమరావతి, ఆంధ్రప్రభ : రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు గోదాములు నిర్మించి అందుబాటు-లో ఉంచే కేంద్ర గిడ్డంగుల సం(సీడబ్ల్యూసీ) మరో ముందడుగు వేసిం ది. పంటలకు విలువ ఆధారిత సేవలు అందించేందుకు వీలు గా ప్రాసెసింగ్‌ ప్లాంట్లను అందుబాటు-లోకి తెస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టుగా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పసుపు, మిర్చి ప్లాంట్లను ఏర్పాటు- చేసింది. రైతుల స్పందన ఆధారంగా ఆయా ప్రాంతాల్లో పండే పంటలకు అనుగుణంగా ప్రాసెసిం గ్‌ ప్లాంట్లు- ఏర్పాటు- చేయనుంది. అయితే ఉత్పత్తుల అమ్మకా ల విషయంలో కూడా ప్రభుత్వ సహకారం ఉండాలని రైతులు కోరుతున్నారు. రైతులు పండించే పంట నేరుగా అమ్మితే వచ్చే ఆదాయం కంటే దాన్ని ప్రాసెసింగ్‌ చేసి విక్రయిస్తే లాభం ఎక్కువ. ఉదాహరణకు పసుపు నేరుగా అమ్మితే వచ్చే డబ్బు కంటే.. దాన్ని పొడిగా మారిస్తే ఆదాయం పెరుగుతుంది. అయితే పంటల ప్రాసెసింగ్‌, ఉత్పత్తుల తయారీ విషయంలో రైతులకు అనేక ఇబ్బందులున్నాయి. ప్రాసెసింగ్‌ ప్లాంట్లు- దగ్గర్లో లేక పోవడం, రవాణా సమస్యలు, ప్యాకింగ్‌, బ్రాండిం గ్‌, మార్కెటింగ్‌ ఇవన్నీ కూడా కలిసొస్తేనే ఆ లాభాలు అందు కోగలరు.

అయితే ప్రభుత్వ సహకారం ఉంటే సమస్యల్ని అధిగమించవచ్చు. ఈ క్రమంలో కేంద్ర గిడ్డంగుల సంస్థ- సీడబ్ల్యూసీ ఓ ప్రయత్నం చేసింది. రైతులకు ఆదాయం కల్పించడంతో పాటు- సంస్థకూ మేలు జరుగుతుందనే ఉద్దేశం తో ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రారంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా గుంటూరు జిల్లా దుగ్గిరా లను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని పసుపు, కారం పొడి తయారీ యంత్రాల్ని ఏర్పాటు- చేశారు. రెండు ప్లాంట్ల ఏర్పాటు-కు రూ.25 లక్షల వ్యయం చేశారు. ఇక్కడి సీడబ్ల్యూసీ గోదాముల్లో నిల్వ చేసిన పసుపు, మిర్చిని ఇక్కడే పొడి చేసి రైతులు విక్రయించుకోవచ్చు. ప్రసుతం పసుపు క్వింటా ధర సగటు-న రూ. 5 వేలు ఉంది. ఇది రైతులకు గిట్టు-బాటు- కాదు. అందుకే పసుపును పొడి చేసి విక్రయిస్తే రైతుకు కనీసంగా మరో రూ.6 వేలు లాభం వస్తుందని అధికారులు చెబుతున్నా రు. రైతులు పొడి చేయించటం, జల్లెడ పట్టించటం కోసం బయట మిల్లులకు తీసుకుని వెళ్తే.. వారు కిలో రూ. 10 తీసుకుంటారు. అయితే ఇక్కడి ప్లాంటు-లో కిలో రూ.5కే పొడి చేసి ఇచ్చేలా ఏర్పాట్లు- చేస్తున్నారు. సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ గోదాములో పసుపు, మిర్చి నిల్వ చేసుకున్న రైతులకు ఈ ప్లాంటు- ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే మరికొన్ని చోట్ల ఆయా ప్రాంతాల్లో పండే పంటలకు అనుగుణంగా మరింత వ్యయంతో ప్రాసెసింగ్‌ యూనిట్లు- ఏర్పాటు- చేస్తామని సంస్థ అధికారులు తెలిపారు. కేంద్ర గిడ్డంగుల సంస్థ ఏర్పాటు- చేసిన ఈ ప్లాంటు- సేవల్ని మరింతగా విస్తరించాలని రైతులు కోరుతున్నారు. కేవలం పొడి చేసి ఇస్తే బ్రాండింగ్‌ లేకుండా దాన్ని రైతులు తిరిగి విక్రయించటం ఎలా సాధ్యమని అంటు-న్నారు. అందుకే సీడబ్ల్యూసీ బ్రాండింగ్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు. అధికారులు అందుకు సానుకూలంగా స్పందించారు. పంట నాణ్యత ధృవపత్రాలను జారీ చేస్తామని.. దాన్ని ఉపయో గించుకుని మార్కెటింగ్‌ చేసుకోవాలని సూచించారు.

అయితే మార్కెటింగ్‌ విషయంలో కూడా ప్రభుత్వ సహకా రాన్ని రైతులు కోరుతున్నారు. కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో సరకు నిల్వ పెట్టు-కున్నందుకు వ్యాపారుల వద్ద వసూలు చేసే ధర కన్నా రైతులకు 30 శాతం తక్కువ ఉంటు-ంది. ఇప్పుడు పొడి తయారీలోనూ రాయితీ లభిస్తుంది. పైగా బయట మిల్లుల్లో ఎక్కడైనా పొడి చేసే సమయంలో కొంత కల్తీకి అవకాశం ఉంటు-ందని, ఇక్కడ నాణ్యమైన ఉత్పత్తులు ఉంటాయని చెబుతున్నారు. పంట ఉత్పత్తుల అమ్మకాల విషయంలో కూడా ప్రభుత్వ శాఖలు సహకరిస్తే ఇలాంటి ప్లాంట్ల ద్వారా తమకు మేలు జరుగుతుందని రైతులు చెబు తున్నారు. బయట మార్కెట్లో పసుపు క్వింటా రూ.5,000 పలుకుతుంది. దీన్ని పొడి చేసి అమ్ముకోగలిగితే దాని రేటు- మార్కెట్లో రూ.10,000 నుంచి 12,000 వరకు ఉంటు-ంది. ఇలా చేయగలిగితే రైతులకు మరింత లాభం చేకూరుతుంది. ఈ దిశగా మేము ఈ మిషనరీ పెట్టాము. తెలుగు రాష్ట్రాల్ల్రో మొట్ట మొదటిసారిగా గుంటూరు జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు- చేశామని సీడబ్ల్యూసీ గోదాము మేనేజర్‌ నిర్మలా బాయి తెలిపారు. ఇది విజయవంతం అయితే మరిన్ని ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు- చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement