Sunday, April 21, 2024

Polling Day – రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం

రాజస్థాన్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్‌ ప్రక్రియ ఆరంభం అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాజస్థాన్‌లో మొత్తం 199 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. .రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఒక్క స్థానానికి పోలింగ్‌ జరగడం లేదు. కరణ్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి గుర్మిత్ సింగ్ కున్నూర్ మరణించడంతో.. అక్కడ ఎన్నిక వాయిదా పడింది.

నేడు జరిగే 199 స్థానాలకు 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5,25,38,105గా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 36,101 పోలింగ్ స్టేషన్లలో 51,507 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం 2,74, 846 మంది సిబ్బంది పని చేస్తుండగా.. లక్ష 70 వేల మంది బందోబస్తు కాస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement