Monday, May 20, 2024

పోచారం ప్రాజెక్ట్ లో మృత‌దేహాలు..వివాహేత‌ర సంబంధ‌మే కార‌ణ‌మా..

పోచారం ప్రాజెక్ట్ లో రెండు మృత‌దేహాలు కుళ్లిపోయిన స్థితిలో క‌నిపించాయి. మృతుల‌ది కామారెడ్డి జిల్లా లింగంపేట మండ‌లం ష‌ట్ప‌ల్లి సంగారెడ్డికి చెందిన‌వారుగా గుర్తించారు పోలీసులు. షట్పల్లి సంగారెడ్డికి చెందిన కత్తుల సంతోష్ ( 32), మాలపాడు కు చెందిన దారబోయిన రాణమ్మ(28) గా గ్రామస్థులుగా గుర్తించారు. వీరి మృతికి కార‌ణం వివాహేత‌ర సంబంధ‌మే అయివుంటుంద‌ని పోలీసులు తెలిపారు. కత్తుల సంతోష్ వ్యవసాయం చేసుకునే వాడు. రాణమ్మ ఇంటిదగ్గరే ఉండేదని అని స్థానికులు తెలిపారు. ఇద్ధరి మధ్య వివాహేతర సంబంధం ఉండటంతో రెండు కుటుంబాల్లో నిత్యం గోడవలు జరగుతున్నాయ‌ట‌. దాంతో వారిద్ద‌రు మూడు రోజుల క్రితం క‌లిసి వెళ్లి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. కత్తుల సంతోష్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉండగా, రాణమ్మ కు భర్త, ఇద్ధరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement