Monday, October 14, 2024

Philippines – గార్మెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం …16 మంది సజీవ‌ద‌హ‌నం …

ఫిలిప్పీన్స్‌లోని గార్మెంట్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 16మంది మరణించారు. రెండు అంతస్తుల ఈ గార్మెంట్ ఫ్యాక్టరీ భవనం బూడిదగా మారింది. ఫ్యాక్టరీలో టీ షర్టులు ప్రింట్‌ చేసినట్లు చెబుతున్నారు. దీనితో పాటు ఇది గిడ్డంగి, కార్మికుల వసతి కోసం కూడా ఉపయోగిస్తున్నారు. అగ్నిప్రమాదంలో కనీసం ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారని అగ్నిమాపక దళం చీఫ్ మార్సెలో రగుండియాజ్ ఈ ప్రమాదం గురించి సమాచారం ఇస్తూ చెప్పారు. భవనం మధ్యలో మంటలు చెలరేగాయి. దీంతో చాలా మంది దీని నుంచి బయటపడలేకపోయారు.

ఫిలిప్పీన్స్‌లో అగ్నిప్రమాదం సమయంలోనే వరదలు, ట్రాఫిక్ జామ్, తప్పుడు చిరునామా కారణంగా అగ్నిమాపక దళం చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో గదులలో నిద్రిస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో మరణించారు.. మృతుల్లో ఫ్యాక్టరీ యజమాని, అతని కుమారుడు కూడా ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement