Thursday, March 28, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొండ‌గ‌ట్టు ప‌ర్య‌ట‌న రూట్ మ్యాప్ విడుద‌ల‌..

హైద‌రాబాద్ – ఈనెల 24న కొండగట్టుకు పవన్ కల్యాణ్ వెళ్ళనున్నారు. ఆయన పర్యటన రూట్ మ్యాప్ విడుదల అయింది. ఆ రోజు ఉద‌యం పవన్ కళ్యాణ్ హైద‌రాబాద్ నుంచి బ‌య‌లు దేరి ఉ.11 గంటలకు కొండ‌గ‌ట్టు చేరుకుంటారు..కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం వారాహి వాహన పూజ జరుపుతారు. అనంత‌రం మ.2 గంటలకు కొడిమ్యాల(మం) నాచుపల్లిలో బృందావన్ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు. సా.4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. సా.5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. ఇదే రోజున అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement