Thursday, May 2, 2024

35 దేశాల్లో విస్తరించిన ఓయో.. ఇండియాలో అతిపెద్ద హోట‌ల్ వ్య‌వ‌స్థ‌గా ఏర్పాటు

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : భారతదేశం ప్రధాన కార్యాలయంగా, భారతదేశంలో అతిపెద్ద హోటల్‌ వ్యవస్థగా, గ్లోబల్‌ ట్రావెల్‌ టెక్నాలజీ కంపెనీ ఓయో 35కు పైగా దేశాల్లో విస్తరించి ఉంది. దేశవ్యాప్తంగా సంస్థ విస్తారమైన ఉనికిని బట్టి, దాదాపు ప్రతిచోటా ఓయో కనపడుతుంది. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో వినియోగదారులకు సరసమైన బసలను అందించడానికి ఓయో చేస్తున్న కృషిపై ఎస్వీపీ – ప్రాడక్ట్‌ అండ్‌ చీఫ్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ శ్రీరంగ్‌ గాడ్‌బోలే మాట్లాడుతూ…

మనం విశ్రాంతి గమ్యస్థానాలు, తీర్థయాత్రలు, రవాణా కేంద్రాలు లేదా వాణిజ్య సముదాయాలు ఇలా ఎక్కడికి వెళ్లినా, భారతదేశపు వీధుల్లో ఎరుపు రంగు ఓయో లోగోను గుర్తించడం సులభమన్నారు. దేశవ్యాప్తంగా ఇటు-వంటి సర్వవ్యాప్త ఉనికి భారతీయులందరికీ వారి ప్రయాణ ఉద్దేశ్యం ఏమైనప్పటికీ వారికి ప్రయాణాన్ని అందుబాటు-లోకి తేవడానికి అనుమతిస్తుందన్నారు. అతి తక్కువ సమయంలో కూడా విస్తృత వినియోగదారు విభాగానికి తగిన, నాణ్యమైన బసను అందించడానికి తమకు విస్తారమైన అవకాశాలను అందిస్తుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement