Sunday, May 19, 2024

ఆక్సిజన్ ఉత్పత్తికోసం స్టెరిలైట్ ప్లాంట్ పునరుద్ధరణ

తమిళనాడు లోని తూత్తుకుడిలో మూడేళ్ళ క్రితం మూసివేసిన స్టెరిలైట్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఈ ప్లాంట్ లో మళ్ళీ ఆక్సిజన్ ఉత్పత్తి కానుంది. కరోనా కేసులు పేరుగుతున్న నేపథ్యంలో..ఆక్సిజన్ కొరతా ఏర్పడింది…దీంతో ఆక్సిజన్‌ ఉత్పత్తి కోసం పరిశ్రమ తెరిచేందుకు అనుమతించాలని వేదాంత లిమిటెడ్‌ సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పరిశ్రమ తెరిచేందుకు అనుమతించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానంగా ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి రాజకీయ కలహాలకు అవకాశం ఇవ్వొద్దని ఆదేశించింది.

ఈ ప్లాంటును కాలుష్యం వెదజల్లుతోందన్న కారణంతో 2018లో మూసివేశారు. అంతకు ముందు తాము ఆక్సీజన్ ఉత్పత్తి చేసి కోవిడ్ రోగులకు ఉచితంగా అందిస్తామని వేదాంత ముందుకు వచ్చింది. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే తమ ప్లాంట్ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవచ్చని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement