Wednesday, May 1, 2024

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : పిల్ల‌ల్లో పెరుగుతున్న ఊబ‌కాయం

కరోనా వ్యాప్తి కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో పిల్లల్లో శారీరక శ్రమ త‌గ్గి వారిలో ఊబకాయం పెరుగుతోంది. ఊబ‌కాయం క‌లిగి ఉండే పిల్లల్లో డయాబెటిస్, గుండె జబ్బులు, ఉబ్బసం, నిద్ర సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్న‌ది. అయితే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీలో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం.. కూరగాయలు, పండ్లను రోజుకు రెండుసార్లు ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని 25 శాతం తగ్గిస్తుంది.

అమెరికన్ సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం.. 6 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజూ కనీసం గంట పాటు మితమైన, శక్తివంతమైన శారీరక శ్రమలో పాల్గొనాలి. సమతుల‌ ఆహారం తీసుకోవడంతోపాటు ఇంట్లో వారి శారీరక శ్రమను పెంచడం ద్వారా పిల్లలను ఆరోగ్యంగా ఉంచవచ్చు.

ఊబకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

టీవీ, మొబైల్ ఫోన్ల‌ను చూస్తూ ఆహారం తిన‌కుండా చూడాలి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, పిల్లల్లో ఊబకాయం పెరుగడానికి ప్ర‌ధాన‌ కారణం వారి స్క్రీన్ ఎక్స్‌పోజ‌ర్‌. టీవీ, మొబైల్, కంప్యూటర్‌ను ఎక్కువసేపు ఉపయోగించే పిల్లలు ఊబకాయం ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. టీవీ ముందు ఎక్కువసేపు కూర్చోవడం అంటే ఎక్కువ స్నాక్స్ తినడమే. దీనివ‌ల్ల‌ అధిక చక్కెర, అధిక కొవ్వు శ‌రీరంలోకి చేరి ఊబకాయానికి కార‌ణ‌మ‌వుతుంది. చిన్నారుల్లో మంచి బుద్ధులు నేర్పించ‌డం త‌ల్లిదండ్రుల బాధ్య‌త‌. త‌ల్లిదండ్రుల మంచి ఆహార‌పు అల‌వాట్ల‌ను, ఫిట్‌నెస్ అవ‌గాహ‌న‌ను చూడ‌టం ద్వారా పిల్ల‌లు వాటిని సుల‌భంగా స్వీక‌రిస్తారు. అందుక‌ని త‌ల్లిదండ్రులు ముందుగా మంచి అల‌వాట్ల‌ను క‌లిగివుండ‌టం చాలా అవ‌స‌రం అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ది హెల్త్ పేర్కొంది.

వయస్సు ప్రకారం.. మూడేళ్ల పిల్లలకు 1000 నుంచి 1400 వరకు, 9-13 సంవత్సరాల వారికి 1400 నుంచి 2200 కేలరీలు అవసరం. ఈ మొత్తంలో కేల‌రీలు అందాలంటే.. పండ్లు, కూరగాయలు తినాలి. ఎందుకంటే ఇవి వారికి విటమిన్లు, ఫైబర్, అవసరమైన ఖనిజాలను ఇస్తుంది. మిశ్రమ గింజలు తినాలి. ఇవి వారికి కాల్షియం, మెగ్నీషియం వంటివాటిని అందిస్తాయి. తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి.

- Advertisement -

పిల్లల పెరుగుదలను బాడీ మాస్ ఇండెక్స్‌తో తనిఖీ చేయవచ్చు.బీఎంఐని తనిఖీ చేయడానికి ప్ర‌స్తుతం ఆన్‌లైన్ కాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. 18-22 మధ్య బీఎంఐ ఆరోగ్యకరమైన పిల్లలకు సంకేతం. బీఎంఐని లెక్కించడానికి సూత్రం: బరువు కేజీ (ఎత్తు x ఎత్తు సెం.మీ) x 10,000. 25 కంటే ఎక్కువ బీఎంఐ ఉండే చిన్నారుల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుంది. 15 కంటే తక్కువ బీఎంఐ ఉండే పిల్లల్లో తక్కువగా ప్రమాదం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement