Sunday, October 6, 2024

Delhi: కేజ్రీవాల్ బెయిల్ పొడిగింపున‌కు నో

వారం రోజులు పొడిగించాల‌ని కోరిన ఢిల్లీ సీఎం
పిటిష‌న్ ద‌శ‌లోనే తిర‌స్క‌రించిన సుప్రీంకోర్టు
ముందుగా నిర్దేశించిన స‌మ‌యానికే లొంగిపోవాల‌ని ఆదేశం
రెగ్యుల‌ర్ బెయిల్ కోసం కింద కోర్టుకు వెళ్లాల‌ని సూచ‌న‌

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని దాఖ‌లు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అస‌లు కేజ్రీవాల్‌ దరఖాస్తును స్వీకరించేందుకు కోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ కేజ్రీవాల్‌కు ఇచ్చింది. కేజ్రీవాల్ దరఖాస్తు విచారణకు అర్హమైనది కాద‌ని పేర్కొంది.. దీంతో సీఎం కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుంది.

కాగా, ఎన్నిక‌ల నేప‌థ్యంలో మే 10న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోవాలని కోరారు. అయితే అకస్మాత్తుగా ఆరేడు కిలోల బరువు తగ్గినందున అనేక వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ వ్యవధిని ఏడు రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టును ఆయ‌న అభ్యర్థించారు. దీనిని సుప్రీంకోర్టు ఇవాళ‌ తిర‌స్క‌రించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement