Sunday, June 2, 2024

పొట్టి క్రికెట్‌ వద్దు.. ఐపీఎల్ భ‌విత‌వ్యంపై చ‌ర్చ‌…

”టీ-20 ద్వైపాక్షిక సిరీస్‌లు అవసరం లేదు… పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌ను కేవలం ప్రపంచ కప్‌కే పరిమితం చేయాలి. ఐపీఎల్‌ వంటి ఫ్రాంచైజీ క్రికెట్‌, వరల్డ్‌ కప్‌లోనే టీ-20 మ్యాచ్‌లను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అదే అసలైన మజా ఇస్తుంది” అని టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంలో పుట్‌బాల్‌ మార్గాన్ని అనుసరించడం సరైనదని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాతో భారత్‌ 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ ఆడనున్న నేపథ్యంలో రవిశాస్త్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐపీఎల్‌ భవిష్యత్‌ గురించి వచ్చిన చర్చలో ఈ అంశం ప్రస్తావనకు రాగా, ఏటా రెండుస్లార్లు ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుందన్న ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యలను రవిశాస్త్రి సమర్థించారు. అలా చేస్తేనే ఐపీఎల్‌కు భవిష్యత్‌ ఉంటుందని శాస్త్రి అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement